Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. హిమాయత్ సాగర్ సమీపంలోని ఓ ఇంట్లోకి శనివారం తెల్లవారుజామున దొంగలు ప్రవేశించారు. ఆ ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ. 50 వేల నగదును అపహరించారు. కిస్మత్పూర్లో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగల ఐదు తులాల బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ఇండ్ల పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.