Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం : విద్యాబుద్ధులతో పాటు జీవిత పాఠాలు నేర్పే పంతులమ్మ అవినీతికి పాల్పడి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడింది. ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలు(హెచ్ఎం) శ్రీదేవి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. మనబస్తీ-మన బడిలో చేపట్టిన అభివృద్ధి పనులకు గాను గుత్తేదారు వద్ద హెచ్ఎం లంచం డిమాండ్ చేసింది. దీంతో సదరు గుత్తేదారు హెచ్ఎంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు శనివారం హెచ్ఎం శ్రీదేవికి రూ. 25 వేలు ఇస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హెచ్ఎం వద్ద ఉన్న రూ. 25 వేలను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై అవినీతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.