Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సాగునీటి పథకాల అధ్యయనం గురించి పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు సభ్యులు గల బృందం తెలంగాణలో పర్యటించనున్నది. మూడు రోజుల పాటు బృందం సభ్యులు రాష్ట్రంలోని మిషన్ కాకతీయ చెరువులు, చెక్‌డ్యాంలు, భూగర్భ జలాల రీచార్జింగ్ కేంద్రాలను సందర్శించనున్నారు.
ఈనెల ఫిబ్రవరి 16 న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కొండపోచమ్మ సాగర్, సిద్దిపేట జిల్లాలో మిషన్ కాకతీయ చెరువులు, చెక్ డ్యాంలను సందర్శించారు. అనంతరం సీఎం పంజాబ్ వెళ్లిన తర్వాత అక్కడి వ్యవసాయ విశ్వ విద్యాలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాల పెరుగుదల తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు వెళ్లి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి సమగ్ర వివరాలు సేకరించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురు సభ్యుల బృందం ఈ నెల 28 నుంచి మార్చి 1 , 2 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న సందర్భంగా వారికి చూపించ వలసిన చెరువులను, చెక్ డ్యాం లను ఎంపిక చేసే పనిలో రాష్ట్ర అధికారులు నిమగ్నమయ్యారు.
సోమవారం వరకు రెండు లేదా మూడు జిల్లాల్లో పంజాబ్ అధికార బృందం పర్యటన వివరాలు ఖరారు అవుతాయని ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పేర్కొన్నారు. వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని గజ్వేల్ ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరాం, భూగర్భ జల శాఖ సంచాలకుడు పండిత్ మధూరే లను ఆదేశించినట్టు పేర్కొన్నారు.