Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌లు చూసిన అభిమానులను అలరించేందుకు మహిళా క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సత్తా చాటేందుకు ముంబై ఇండియన్స్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి వారం రోజులు మాత్రమే ఉంది. దాంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తమ జట్టు జెర్సీని ఈరోజు విడుదల చేసింది. జెర్సీని వర్ణిస్తూ సోషల్‌మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ట్విట్టర్ వీడియోలో.. ‘ఇది సూపర్ హీరోలు ధరించే జెర్సీ – మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ జెర్సీ. మేమంతా ఈ జెర్సీని ఎంతో ఇష్టపడుతున్నాం’ అని జట్టు యాజమాన్యం రాసుకొచ్చింది. ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ జెర్సీ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. వావ్.. ఈ జెర్సీ చాలా అందంగా ఉంది అని కొందరు, చాలా అద్భుతంగా ఉందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.