Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో భాగంగా ఎంజీఎం విధుల నుంచి సైఫ్‌ను సస్పెన్షన్ చేశారు. మెడికల్ లీగల్ కేసుగా పరిగణిస్తూ చర్యలు తీసుకున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ వెల్లడించారు. వేధింపులు రుజువై శిక్షపడితే సైఫ్‌ను కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే డీఎంఈకి వైద్యుల బృందం విచారణ నివేదికను పంపించామని పేర్కొంది. విచారణ నివేదికను ఎంసీఐకి సైతం పంపిస్తామని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. ఇదిలా ఉండగా... సీపీ రంగనాథ్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన ఆయన సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సప్ చాట్స్ ద్వారా తెలిసిందన్నారు. సైఫ్ మొబైల్ లో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. తన ఫ్రెండ్స్ తో కూడా ప్రీతి ఎక్కువ చేస్తున్నట్లు చెప్పాడని, సైఫ్ కి ప్రీతి తనని ఎందుకు వేధిస్తున్నావ్ అంటూ మెసేజ్ కూడా చేసిందని సిపి రంగనాథ్ పేర్కొన్నారు. సైఫ్ వేధింపులే ప్రీతి తీవ్ర నిర్ణయానికి కారణం అన్నారు.