Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట
నేడు జిల్లా వ్యాప్తంగా పదో తరగతి చదువుతున్న తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు, ఇతర అధికారులతో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ తరుణంలో పది విద్యార్థులను ఈ రెండు నెలల పాటు ఉదయం 5 గంటలకే నిద్ర లేపి బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. పది ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ. 10 వేలు ప్రైజ్ మనీ ఇస్తామని, అంతే కాకుండా గతేడాది ఫలితాలను పునరావృతం చేయాలని కోరారు. పది పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలల ఉపాధ్యాయులకు రివార్డులు ఇస్తామని హరీశ్‌రావు తెలిపారు.