Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కి రెండు జాతీయ అవార్డులు లభించింది. రహదారి భద్రత కేటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక హీరోస్ ఆన్ ది రోడ్ పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) శనివారం ప్రకటించింది. దీనిలో కుషాయిగూడ డిపోకు చెందిన కె. రంగారెడ్డి, సూర్యాపేటకు డిపోకు చెందిన కె. సోమిరెడ్డిలు అవార్డులకు ఎంపికయ్యారు.
తమ సర్వీస్‌లో ప్రమాదరహితంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఈ పురస్కారాలు వారికి లభించాయి. పట్టణ, గ్రామీణ విభాగాల్లో ఈ అవార్డులను ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. ఈ అవార్డులను కేంద్ర రోడ్డు, ట్రాన్స్పోర్ట్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రిల్ 18న న్యూఢిల్లీలో విజేతలకు అందజేస్తారు. అవార్డు వరించిన ఇద్దరు డ్రైవర్లు కె. రంగారెడ్డి, కె. సోమిరెడ్డిలకు సర్టిఫికేట్, నగదు పురస్కారంతో పాటు ట్రోఫీలను అందజేసి సత్కరిస్తారు.