Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ మండలం రాజబొల్లారానికి చెందిన నివాస్(19), ఘట్ కేసర్ మండలం చౌదరి గూడలోని ఓ కళాశాలలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొత్తగూడానికి చెందిన సాయి గణేష్ (22) సమీపంలో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ లో పని చేసి ఏడాది క్రితం మానేశాడు.
అతనితో స్నేహం ఉండటంతో ఇద్దరూ కళాశాల సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో నివాస్ తాడుతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని, సాయి గణేష్ విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి యజమాని ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని, వారు వస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు.