Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 5వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మార్చి 5వ తేదీన ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల దాకా, మళ్లీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పరీక్ష ఉంటుందని గుర్తు చేసింది. అభ్యర్థులు 27వ తేదీ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని గుర్తుచేసింది.