Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పోర్ట్ మోర్స్బే
పపువా న్యూగినియాలో భారీ భూకంపం వచ్చింది. న్యూగినియాలోని కండ్రియాన్లో శనివారం రాత్రి 9.24 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించింది. దీని తీవ్రత 6.2గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూఅంతర్భాగంలో 38.2 కిలోమీటర్ల లోతులు కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు.