Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఈపీఎస్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు వికాస్, కళ్యాణ్, ప్రవీణ్‌గా గుర్తించారు. వారిలో ఇద్దరు కడప జిల్లాకు, ఒకరు నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.