Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అప్ఘానిస్తాన్
అప్ఘానిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపిన వివరాల ప్రకారం అప్ఘానిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు 4.3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉంది. మరోవైపు పాపువా న్యూ గినియాలోనూ భూకంపం సంభవించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాపువా న్యూ గినియాలోని న్యూ బ్రిటన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదయ్యింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.