Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: పుట్టుకతోనే వచ్చిన వ్యాధి.. ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం కన్పించడం లేదు. తల్లిదండ్రులకు భారం కావొద్దని ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. జీడిమెట్ల ఎస్సై మన్మధరావు వివరాల మేరకు.. సంజయ్గాంధీనగర్కి చెందిన శ్రీనివాసరావు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. తొలుత ఓ కుమార్తె జన్మించగా.. రెండో కాన్పులో ఒకేసారి ముగ్గురు కవలలు జన్మించారు. వీరిలో దివ్య(21)కి పుట్టుకతోనే థైరాయిడ్ సమస్య ఉంది. వైద్యం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె డిగ్రీ చివరి ఏడాది చదువుతోంది. కొన్ని రోజులుగా థైరాయిడ్ సమస్య తీవ్రం కావడంతో మానసికంగా కుంగిపోయింది. శనివారం ఉదయం ఇంటి వెనుక ఉరేసుకుంటున్నట్లు కుటుంబీకులు గమనించారు. వెంటనే వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.