Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుజరాత్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న జీఎస్టీ ఉద్యోగి గుండెపోటుతో మరణించాడు. బౌలింగ్ చేస్తుండగా ఆ జీఎస్టీ ఉద్యోగికి ఆరోగ్యం క్షీణించి, కింద పడిపోయారు. గత కొంతకాలంగా యువతలో గుండెపోటు కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. రాజ్‌కోట్-సురాట్లో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో ఒక యువకుడు మరణించిన ఉదంతం ఇటీవలే చోటుచేసుకుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అహ్మదాబాద్‌లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోర్ ఆడుతున్నాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు వసంత్‌కు ఛాతీలో నొప్పి వచ్చి, కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. వసంత్ గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు.