Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తమిళనాడు
తమిళనాడులోని చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో ప్రయాణిస్తున్న వందే భారత్ రైలు (20607)పై శనివారం కృష్ణరాజపురం రైల్వే స్టేషన్కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో రైలులోని ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వందేభారత్ సీ4 కోచ్ 10, 11, 12, సీ5 కోచ్ 20, 21, 22 కిటికీలు పగిలిపోయాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సంఘటనా స్థలానికి చేరుకుని దుండుగుల కోసం గాలించారు. ఈ విషయంపై సౌత్ వెస్ట్రన్ రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కుసుమా హరిప్రసాద్ మాట్లాడుతూ దీనిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు నమోదు చేసిందని అన్నారు.