Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసి ఆవేదన వెళ్లబోసుకుంది. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారు. సీనియర్లంతా ఒక్కటయ్యారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకపోయింది. సైఫ్ వేధింపులు మితిమీరిపోతున్నాయి. నేను అతడిపై కంప్లైంట్ ఇస్తే.. సీనియర్లంతా నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్ఓడీ నాగార్జున రెడ్డి నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు’’ అని ప్రీతి తన తల్లితో చెప్పుకుని బాధపడింది.
సైఫ్‌తో తాను మాట్లాడతానని.. సమస్య లేకుండా చూస్తానని తల్లి ఆమెకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉంది.