Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో కొద్ది నెలలపాటు జైలు జీవితం గడపవలసి వస్తే, దానిని తాను ఏ మాత్రం పట్టించుకోనని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా అన్నారు. తాను స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ అనుచరుడినని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు హాజరుకాబోతున్నానని తెలిపారు. సిసోడియా ఇచ్చిన ట్వీట్లో, ఆదివారం ఉదయం తాను సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతానని తెలిపారు. ఈ దర్యాప్తులో తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. లక్షలాది మంది బాలల ప్రేమాభిమానాలు, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు తనకు ఉన్నాయన్నారు. కొద్ది నెలలపాటు జైలులో ఉండవలసి వస్తే తాను పట్టించుకోనన్నారు.