Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ స్నేహితుడి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడైన హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్.. నవీన్ తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తన కుమారుడు ఒక్కడే అంత కిరాతకంగా హత్య చేయడం సాధ్యం కాదని.. ఈ హత్య వెనుక ఇంకా ఎవరో ఉన్నారని ఆరోపించారు. హత్య కేసుపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడిని పోలీసులకు లొంగిపోవాలని తానే చెప్పినట్లు వివరించారు.