Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్‌లోని బాలాపూర్ యువకుని కిడ్నాప్, హత్య కలకలం సృష్టిస్తున్నది. బాలాపూర్‌లోని ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఫైజల్ ఈ నెల 12న రాత్రి 9 గంటలకు బటకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి కనిపించకుండా పోయాడు. తమ కొడుకు ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఫైజల్ తల్లిదండ్రులు ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిబ్రవరి 25న రాత్రి ఒంటి గంట సమయంలో హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మృతదేహాన్ని ఫైజల్ తల్లిదండ్రులకు చూపించి.. అది అతడిదేనని నిర్ధారించుకున్నారు. ఫైజర్‌ను స్నేహితుడు జబ్బార్ ఈ హత్యచేసినట్లుగా గుర్తించారు. చిన్నపాటి గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. దుండగులతో కలిసి కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చారు. బండరాయితో తలపై కొట్టి హతమార్చిన అనంతరం.. తల, మొండెం వేశారు. మృతుడు, నిందితుడు కలిసి ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫైజల్‌ను ఫిబ్రవరి 12నే కిడ్నాప్ చేసి, అదే రోజు హత్యచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు పైజల్‌కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగిందని, ప్రస్తుతం అతని భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు తెలిపారు.