Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
ఏడో వేతన కమిషన్ సిఫారసుల అమలుతో పాటు పాతపెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలనే డిమాండ్‌తో మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడాక్షరి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులంతా మూకుమ్మడిగా ఆందోళనలో పాల్గొంటారన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి గడువు ఇచ్చామని, సమస్య పరిష్కారం కానందునే నిరసనల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వేతనాల పెంపునకు సంబంధించి ప్రభుత్వం నోటి మాటలతోనే జాప్యం చేస్తోందన్నారు. వేతనాల విషయంలో స్పష్టమైన ఆదేశాలు లేవన్నారు. ఇందుకోసం ఏడెనిమిది నెలలుగా వేచి చూస్తున్నామని పేర్కొన్నారు. బడ్జెట్లో ప్రకటిస్తారని ఆశించామని, కానీ అటువంటి ప్రస్తావనే లేకుండా చేశారన్నారు. పాతపెన్షన్ విధానం అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు.