Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో ఉగ్రమూకలు చేసిన దాడిలో ఓ బ్యాంకు సెక్యూరిటీ గార్డు మరణించాడు. మృతుడిని సంజయ్ పండిత్‌గా పోలీసులు గుర్తించారు. తూటాలకు నేలకొరిగిన బాధితుడిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సంజయ్ తన భార్యతో కలిసి మార్కెట్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు కావాలనే సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు..పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.