Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లఖ్‌నవూ
యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిని ట్రక్ రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం మహోబా పట్టణానికి చెందిన ఉదిత్ నారాయణ్ చాన్సోరియా(67), తన మనవడు సాత్విక్(6)ని స్కూటీపై ఎక్కించుకొని మార్కెట్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో స్కూటీని ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో కిందపడ్డ ఉదిత్ నారాయణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ తరుణంలో స్కూటీతో సహా సాత్విక్‌ను దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.
ఈ ఘటన కాన్పుర్-సాగర్ హైవే ఎన్‌హెచ్ 8పై చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. పలువురు ద్విచక్ర వాహనదారులు ట్రక్‌ను వెంబడిస్తున్నట్లుగా దీనిలో కనిపిస్తోంది. డ్రైవర్ ఎంతకీ ట్రక్‌ను ఆపకపోవడంతో రోడ్డుపై అడ్డంగా బారికేడ్లు, రాళ్లు పెట్టాల్సి వచ్చింది. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన స్థానికులు డ్రైవర్‌ను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్‌ను సీజ్ చేసి, డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.