Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢీల్లి
ఇటలీ తీరంలో విషాదం చోటుచేసుకుంది. శరణార్థులతో వస్తున్న ఓ పడవ మునిగి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌కు చెందినవారిగా గుర్తించారు.
కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు. ఈ తరుణంలో క్రోటోన్ ప్రావిన్స్‌లోని సముద్రతీర రిసార్ట్ అయిన స్టెకాటో డి కుట్రో ఒడ్డున కొట్టుకుపోయిన 27 మృతదేహాలు కనుగొనబడ్డాయి. సముద్రంలో మరిన్ని కనిపించాయని, మరో మూడు నీటిలో కనిపించాయని ఆ దేశ వార్తా సంస్థ ప్రచురించింది. వలసదారులను తీసుకెళ్లిన పడవలో 100 మందికి పైగా ఉన్నారని, దాదాపు 50 మందిని రక్షించారని తెలిసింది. ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చినవారిని తీసుకువస్తున్న పడవ, కఠినమైన సముద్ర వాతావరణంలో మునిగిపోయిందని సమాచారం.