Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ
నేడు విజయవాడలో నిర్వహించిన ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య సదస్సుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ తరుణంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరిచే సత్తా బ్యాంకర్లకే ఉందన్నారు. రైతు ఆత్మహత్యల నివారణపై బ్యాంకర్లు ఆలోచించాలని కోరారు. రైతులు, కౌలు రైతులకు వేర్వేరుగా రుణాలు ఇచ్చేలా సహకరించాలని సూచించారు.
దీంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉంటా. నా ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచే పోటీ చేస్తా. నా ఆశయాలకు సరిపోకపోతే స్వతంత్రంగా అయినా బరిలో నిలుస్తాను. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్నారు. అంతే కాకుండా ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను నిలుపుదల చేయాలి. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలి’’ అని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.