उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023
Authorization
उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023
నవతెలంగాణ - లక్నో
ఘజియాబాద్ జిల్లాలోని ముస్సోరీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఒక పెళ్లి వేడుక జరిగింది. దీనిలో డీజే ప్లే చేసిన మ్యూజిక్‌పై వివాదం చెలరేగింది. ఇది పెద్ద గొడవగా మారింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సుమారు 20 మందిపై కేసు నమోదు చేశారు. 9 మందిని అరెస్ట్ చేశారు.
ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన అఖిలేష్ యాదవ్ దీనిపై స్పందించారు. పెళ్లిలో జరిగిన ఈ కోట్లాటకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్విట్టర్ వేధికగా పోస్ట్ చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై మండిపడ్డారు. యూపీలో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించింది అని విమర్శించారు.