Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
గుజరాత్ రాష్ట్రంలో ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6E-646 విమానం ఆదివారం సూరత్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే సూరత్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఆ విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు.
ఆ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ విషయాన్ని నిర్ధారించింది. సూరత్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు తెలిపింది. ఈ తరుణంలో ఆ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు తెలిపింది.