Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మెదక్
మెదక్ జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ఆవరణలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ శ్రీరామ నవమి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మెదక్ ఎంసీహెచ్ సేవల్లో మంచి స్థానంలో ఉందన్నారు. జనవరిలో 81శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయని, సౌకర్యాలు బాగుండడంతో ప్రజలు వస్తున్నారన్నారు. మెదక్ రామాయంపేట, నర్సాపూర్‌లో 90శాతం డెలివరీలు జరగాలని, ఈ మేరకు సిబ్బంది కృషి చేయాలన్నారు.
బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని, శ్రీరామ నవమి నుంచి కేసీఆర్ న్యూటిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గర్భిణికి 4, 6,7 నెలలో ఇస్తామన్నారు. బలం లేక పుట్టే పిల్లలు తక్కువ బరుగువుతో పుడుతున్నారని, వారికి పౌష్టికాహరాన్ని పేదరికంతో వల్ల అందించలేకపోతున్నారన్నారు. న్యూట్రిషన్ కిట్‌లో ప్రోటీన్ పౌడర్, నెయ్యి, ఖజ్జురా తదితరాలుంటాయిన, వీటితో గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల కోసం రూ.250కోట్లు బడ్జెట్లో కేటాయించారన్నారు.