Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
మద్యం కుంభకోణం కేసులో ఢీల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేయడంపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢీల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ తరుణంలో మనీశ్ సిసోదియా అమాయకుడు ఆయన్ను అరెస్టు చేయడం దుష్ట రాజకీయం. ఈ అరెస్టుతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ గమనిస్తున్నారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. దీనిపై ప్రజలే స్పందిస్తారు’’ అని ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఇలాంటి చర్యలు తమలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.