Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ధరణిలో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశం కానుంది. భూ సమస్యలు పరిష్కరించేందుకు ధరణిలో కొత్త మాడ్యూళ్లు తెస్తున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలతో రైతులు సతమతమవుతూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని సమస్యల పరిష్కారానికి ధరణిలో ఆప్షన్లు లేవు. వాటి కోసం కొత్త మాడ్యూళ్లు తీసుకొచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. సాదాబైనామా, జీవో 58కి సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు. రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై సబ్ కమిటీ ఉన్నతాధికారులతో చర్చించనుంది. పేదలకు భూములను ఉచితంగా క్రమబద్ధీకరించే అంశం, పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ప్రధానంగా ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.