Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ (డీఏవో) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 63% మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు 1,06,253 మంది దరఖాస్తు చేసుకోగా.. ఉదయం పేపర్-1 పరీక్షకు 67,830 మంది, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షకు 66,903 మంది హాజరయ్యారు. రాష్ట్రంలోని 241 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ పరీక్షలో రెండు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని వివరించారు.