Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా (51) పిల్లలతో కలిసి 12వ తరగతి పరీక్షలు రాశారు. ఫిబ్రవరి 16న.. ఓ చేతిలో పరీక్షల అట్ట (ప్యాడ్), మరో చేతిలో మంచినీళ్ల సీసా పట్టుకుని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ‘లా’ చదవాలనే ఆసక్తితోనే 12వ తరగతి పరీక్షలు రాస్తున్నానని ఆయన తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశ్ బీజేపీ తరఫున బరేలీలోని బిత్రి చైన్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో రాజకీయాలతో పాటు చదువు కొనసాగించాలని మిశ్రా నిర్ణయించుకున్నారు. ‘‘ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు మంచి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేరు. అలాంటి వారి తరఫున కేసులు వాదించేందుకు లా చదివాలని భావిస్తున్నాను. అందుకే ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలు రాశా. నేను రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు చదువుతా. పగలు కూడా వీలైనప్పుడు చదువుకుంటాను’’ అని ఆయన తెలిపారు. 12వ తరగతి పరీక్షలు రాసిన రాజేశ్ మిశ్రకు డిగ్రీ చదివిన ముగ్గురు పిల్లలు ఉన్నారు.