Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేడు మరికొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వారం రోజులుగా రైల్వే శాఖ పలు సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది. అయితే.. పని దినాల్లోనూ సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చౌకధరకు అందుబాటులో ఉండే రవాణా సదుపాయం దూరమైందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సోమవారం 19 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే..
- హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే 3 సర్వీసులు
- ఫలక్నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 5 సర్వీసులు
- లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్లేవి 5
- రామచంద్రాపురం-ఫలక్నుమా 2 సర్వీసులు
- ఫలక్నుమా నుంచి హైదరాబాద్ వెళ్లేది
- లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లేవి