Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అన్నానగర్: గుండెపోటుతో నవ వరుడు మృతిచెందిన ఘటన ఈరోడ్‌లో జరిగింది. నసియానూర్ కన్నవేలం పాళయానికి చెందిన ప్రకాష్ (36)కు ఈ నెల 23వ తేదీ వివాహం జరిగింది. శనివారం అత్తగారి ఇంటికి వెళ్లిన ప్రకాష్ మటన్ తిన్నాడు. తన భార్యతో అమ్మగారి ఇంటికి వచ్చాడు. రాత్రి మరోసారి మటన్ తిని పడుకున్నాడు. ఆదివారం వేకువజామున 2 గంటలకు శరీరమంతా దురద పుడుతోందని చెప్పాడు. కొద్ది సేపటికే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాంజీకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.