Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్: ప్రేమోన్మాది వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు యశ్వంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా... వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రక్షిత ఓ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడు ప్రేమ పేరుతో రక్షితను వేధింపులకు గురిచేశారు. రోజు రోజుకు రాహుల్ వేధింపులు ఎక్కువవడంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. చివరకు వేధింపులు తాళలేక యువతి వరంగల్‌లోని బంధువుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు వరంగల్‌లో మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుంచి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.