Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాల వద్ద ఏబీవీపీ సభ్యులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేఎంసీ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.