Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఇండ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతున్నది. ఇండ్ల స్థలాలు, 58, 59 ఉత్తర్వుల కింద క్రమబద్ధీకరణ సహా సంబంధిత అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, మల్లా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే అంశపై ఈనెల 13న కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే. 2023-24 వార్షిక బడ్జెట్లో సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.7350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందించనున్నది. ఈ ఏడాది మొత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి, పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మంది చొప్పున సాయం అందిచనున్నారు.