Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మణిపూర్
మణిపూర్లో బాంబు పేలుడు సంభవించింది. ఇంఫాల్ నగరంలోని పీడబ్ల్యూడీ ఇంజినీరు నివాసగృహం వద్ద బాంబు పేలుడు ఘటన జరిగింది. పీడబ్ల్యూడీ ఇంజినీరు నివాస గృహం వద్ద బాంబు పేలడంతో కాంప్లెక్సులో పనిచేస్తున్న బీహార్ భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడులో గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. గేటు వద్ద పార్కింగ్ చేసిన వాహనం పేలుడు ధాటికి దెబ్బతింది. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు బాంబు పేలుడు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.