Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కూకట్పల్లి ప్రశాంత్ నగర్లోని ఓ స్క్రాప్ గోదాములో ఈ రోజు తెల్లవారుఝామున అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోదాము నుండి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు.
ఈ తరుణంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,స్తానిక పోలిసులు మంటలను వ్యాపించకుండా జీడిమెట్ల, సనత్ నగర్,కూకట్ పల్లి కి చెందిన 4ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారని జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ సంఘటనలో ఎవరికి ప్రాణహానీ జరగలేదని, 4 స్క్రాప్ గోదాములు 2 ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ షెడ్లు, అశోక్ లీల్యాండ్ గూడ్స్ వాహనం, మారుతి 800 కారు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు తెలిపారు.