Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ప్రీతిది ఆత్మహత్యా లేక హత్యనా అనే అనుమానాలపై విచారణ చేయాలని ఓయూ జేఏసీ కోరింది. ఈ విషయంపై హెచ్ఆర్సీ ని ఓయూ జేఏసీ ఆశ్రయించింది. మెడికో విద్యార్థిని ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని సోమవారం హెచ్ఆర్సీలో ఓయూ జేఏసీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ తరుణంలో ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ మాట్లాడుతూ మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రీతి కుటుంబాన్ని డీసీపీ జోయల్ డెవిస్ తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్నారు. గాంధీలో నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను అనుమతించలేదని తెలిపారు. ప్రీతి మృతదేహానికి సీనియర్ డాక్టర్స్ చేత పోస్టుమార్టం చేయించలేదన్నారు. జూనియర్ డాక్టర్స్ చేత పోస్టుమార్టం చేయించారని మండిపడ్డారు. ప్రీతి మృతిఫై సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపించాలని సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు.