Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నవీన్‌ను హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో పోలీసుల రిమాండ్ రిపోర్టు కీలక విషయాలను వెల్లడిండింది. నవీన్‌ను హత్య చేయాలని మూడు నెలల ముందే పథకం వేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకోసం రెండు నెలల క్రితమే మలక్‌పేటలోని ఓ సూపర్ మార్కెట్లో కత్తి కొనుగోలు చేసినట్లు తెలిపింది.
ఈనెల 17వ తేదీన పక్కా ప్లాన్ ప్రకారం నవీన్‌ను హత్య చేశాడు. హత్యకు ముందు పెద్దఅంబర్‌పేటలో నవీన్, హరికృష్ణ మద్యం తాగారు. మద్యం మత్తులో యువతి విషయంలో స్నేహితులిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ తరుణంలో ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి నవీన్‌ను హత్య చేశాడు. హత్య తర్వాత శరీరం నుంచి తల, వేళ్లు, ఇతర భాగాలను కత్తితో వేరు చేసి బ్యాగులో వేసుకొని పరారయ్యాడు. వాటిని తీసుకెళ్లి బ్రాహ్మణపల్లి పరిధిలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తర్వాత హరిహర కృష్ణ పక్కనే ఉన్న తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. అక్కడే స్నానం చేసి దుస్తులు మార్చుకొని హత్య చేసిన విషయాన్ని హసన్‌కు తెలిపారు. ఇదే విషయాన్ని మరుసటి రోజు ప్రియురాలికి కూడా చెప్పాడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నం వెళ్లాడు. 24వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని శరీర విడిభాగాలను సేకరించి దహనం చేశాడు. 24న సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయాడు’’ అని రిపోర్టు వెల్లడించింది.