Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇటలీ
ఆదివారం ఉందయం దక్షిణ కలాబ్రియా రీజియన్‌లో భారీ బండరాయిని ఢీకొట్టి పడవ మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 200 మంది ఉన్నారు. వారిలో 59 మంది మరణించగా, 81 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ తరుణంలో పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇవాళ మరో 19 మంది మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తం మృతుల సంఖ్య 59కి చేరుకుంది. రెస్క్యూ టీమ్స్ కాపాడిన 81 మందిలో 20 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా మరణించిన 59 మంది 12 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి జనం ఉండటం. సముద్రంలో బలమైన ఈదురు గాలులు వీయడం ప్రమాదానికి కారణమైందని ఇటాలియన్ కోస్ట్‌గార్డ్స్ తెలిపారు.