Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
సినీ నటి ఖుష్బూ సుందర్ కీలక పదవికి నామినేట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా మొత్తం ముగ్గురిని నామినేట్ చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ తరుణంలో ఖుష్బూ ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ అయిన వారిలో ఖుష్బూ సుందర్‌తో పాటు మమత కుమారి, డెలియానా కొంగ్డుప్ ఉన్నారు.