Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కెరియర్‌పై టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ తిరిగి భారత జట్టులో చేరి ఆడేందుకు రెండేళ్ల వరకు పడుతుందని అంచనా వేశాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు మేనేజ్మెంట్ బాధ్యతల్లో ఉన్న గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఢిల్లీ కేపిటల్స్ జట్టులో పంత్ స్థానాన్ని పూడ్చడం కష్టసాధ్యమన్న గంగూలీ అతడి స్థానంలో జట్టులోకి వచ్చేదెవరన్న విషయంలో జట్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. పంత్‌కు ప్రమాదం జరిగిన తర్వాత తాను రెండుసార్లు మాట్లడినట్టు తెలిపాడు. ప్రస్తుతం అతడికి కష్టకాలం నడుస్తోందని, గాయాలు, సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టు తెలిపాడు. ఢిల్లీ జట్టు ఇంకా పంత్ రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు. యువ ఆటగాళ్లు అభిషేక్ పోరెల్ లేదంటే దేశవాళీ వెటరన్ ఆటగాడు షెల్డన్ జాక్సన్ ను తీసుకోవాలా? అనే విషయంలో గంగూలీ కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.