Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టర్కి
మూడు వారాల క్రితం భారీ భూకంపాలతో వణికిపోయిన టర్కీని తాజాగా మరో భూకంపం కలవరపెట్టింది. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ తరుణంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 69 మందికి గాయాలయ్యాయి. టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి. క్షతగాత్రులను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.