Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మద్యం కుంభకోణం కేసులో ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టును బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీ - అదానీ సంబంధాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సిసోదియాను అరెస్టు చేశారని విమర్శించారు.
దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. విపక్షాలపైనా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపిస్తోంది. ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను కేసీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.