Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మజ్లీస్ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రియాంక అలా రహమత్ బేగ్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కాగా ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఎంఐఎం పార్టీ అభ్యర్థి రహమత్ బేగ్‌లు నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ మజ్లిస్ అభ్యర్థికి మద్ధతు ప్రకటించింది.
ఈ తరుణంలో నామినేషన్లను శుక్రవారం పరిశీలించిన ఎన్నికల అధికారులు ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్ నామినేషన్ తిరస్కరించారు. రహీంఖాన్‌ను బలపరిచిన పది మంది ఓటర్లు కాకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రహమత్ బేగ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.