Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యాదాద్రి లక్ష్మినరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు యాదగిరి గుట్టపైకి వాహనాలను అనుమతించమని యాద్రాది భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. అయితే డీసీపీ సంతకంతో జారీ అయిన పాస్‌లు కల్గి ఉన్న వారికి మాత్రమే గుట్టపైకి అనుమతి ఉంటుందని, అలాగే కళ్యాణం వీక్షించేందుకు వచ్చేవారికి స్పెషల్ పాస్‌లు ఉంటేనే అనుమతి ఉంటుందన్నారు.
పాస్‌లు లేని వారు బయట ఎల్ఈడీ స్క్రీన్లపై కళ్యాణం వీక్షించాలని సూచించారు. అంతే కాకుండా ఈ పాస్‌ల కోసం ఆలయ అధికారులను సంప్రదించాలని సూచించారు. పాస్‌లు లేని వారు గుట్ట కింద తమ వాహనాలను పార్కు చేసుకోవాలని సూచించారు.