Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
వెన్ను గాయంతో దాదాపు అయిదు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మైదానంలో అడుగు పెట్టేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. ఇంకో నెల రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్‌కు కూడా అతను పూర్తిగా దూరమవబోతున్నట్లు సమాచారం.
భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించినా అందులో బుమ్రా ఆడే అవకాశాలు కూడా దాదాపు లేనట్లే అని తెలుస్తోంది. గత ఏడాది వెన్ను గాయానికి గురై కొన్ని నెలల పాటు ఆటకు దూరమైన బుమ్రా తర్వాత కోలుకుని జట్టులోకి పునరాగమనం చేసినా ఎక్కువ రోజులు ఆటలో కొనసాగలేకపోయాడు. ఈ తరుణంలో అతను పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ వైద్యులు నిర్ధరించడంతో కొన్ని రోజుల్లోనే అతణ్ని జట్టు నుంచి తప్పించారు. ఐపీఎల్ సమయానికి అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని అంచనా వేయగా అందుకు అవకాశం లేదని తేలిపోయింది.