Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
షాపులో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హయత్‌నగర్‌కు చెందిన మేక సునీత ప్రకాశ్‌రెడ్డి(40) స్థానికంగా పుల్లారెడ్డి స్వీట్ షాపు సమీపంలోని ఆదిత్యనగర్ కాలనీలో కిరాణ షాపు నిర్వహిస్తోంది.
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై షాపు వద్దకు వచ్చారు. బైకు వెనుక కూర్చొన్న హెల్మెట్ ధరించిన వ్యక్తి షాపులోకి వెళ్లి సిగరెట్ కావాలని అడిగాడు. సిగరెట్ తీసి ఇస్తుండగా ఆమె మెడపై కత్తి పెట్టి బెదిరించి గొలుసు లాక్కొని పారిపోయారు. అయితే లాక్కొని వెళ్ళిన గొలుసు రోల్డ్‌గోల్డ్ కావడం విశేషం. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.