Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
భారత రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఐఆర్సీటీసీ కుంభకోణం ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను వదలడం లేదు. ఇదే కేసులో తాజాగా ఆయనకు, ఆయన భార్య రబ్రీదేవికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.
ఆయన కుమార్తె మీసా భారతితో పాటు మరో 11 మంది నిందితులకు కూడా సమన్లు పంపింది. మార్చి 15వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లలో తెలిపింది. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. బీహార్ లోని అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములను తీసుకుని, వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలను ఇప్పించారని వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది.